Current Date: 26 Nov, 2024

ఆర్జీవీపై ఏపీలో కేసు నమోదు.. అరెస్ట్ చేస్తారా?

రామ్ గోపాల్ వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బ్రహ్మణి వ్యక్తిత్వాన్ని కించపర్చేలా పోస్టులు పెట్టారని ఆయనపై టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమాను 2024 మార్చి 2న ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టులో అప్పట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సినిమాపై ఏర్పాటు చేసిన కమిటీ సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగాయి. వ్యూహం సినిమాకి క్లియరెన్స్ రావడంతో.. సోషల్ మీడియాలో ఆర్జీవీ అభ్యంతకర పోస్టులు పెట్టాడు. దాంతో.. రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా వైయస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసుల అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

Share