Current Date: 27 Nov, 2024

అలియా కూతురు విషయంలో నెరవేరిన ఎన్టీఆర్ కోరిక ఆలస్యంగా వెలుగులోకి

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూతురి గురించి తారక్ అనుకున్న ఓ విషయం బయటపడింది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న 'దేవర'ని బాలీవుడ్‌లో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరణ్ఆ లియా-ఎన్టీఆర్‌ని కలిపి ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో చాలా విషయాలు మాట్లాడుకున్నారు. అయితే ఆలియా చెప్పిన విషయం మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.'బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వస్తే  రాత్రి మా ఇంట్లోనే డిన్నర్ చేయాలని తారక్ చెప్పాడు. దీంతో అతడి ఇంటికి వెళ్లాం. ఆ రోజు సాయంత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటికే నాకు 9వ నెల. దీంతో పుట్టబోయే బిడ్డకి పేరు ఏం పెట్టాలా అని డిస్కస్ చేసుకున్నాం. అ‍బ్బాయి పుడితే ఇది, అమ్మాయి పుడితే ఈ పేరు పెట్టాలని రణ్‌బీర్ చెప్పాడు' అని ఆలియా అప్పటి విషయాన్ని గుర్తుచేసుకోగా.. తారక్ మాట్లాడుతూ  'రాహ పేరు పెట్టాలని నేను కోరుకున్నా. అది కాస్త నిజమైంది' అని నవ్వేశాడు.  పాపకి రాహ అని పేరుని అలియా దంపతులు పెట్టిన విషయం తెలిసిందే.దేవర మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతుంది. 

Share