Current Date: 25 Nov, 2024

District Collector Mallikarjuna should be removed from election duties - East MLA Velagapudi Ramakrishna

 వైసీపీ తొత్తుగా పని చేస్తున్న జిల్లా కలెక్టర్ మల్లిఖార్జునను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని తూర్పు నియోజకవర్గం టీడీపీ 
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కేంద్ర ఎన్నికల కమిషన్ కు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టర్ మల్లికార్జున వ్యవహారంపై చీఫ్ సెక్రెటరీ, ఎలెక్షన్ కమిషనర్ లకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. దశపల్లా, హాయగ్రీవ భూములు అధికార పార్టీ నేతల పరమాయమయ్యాయని ఆరోపించారు. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వి ఎం ఆర్ డి ఏ మాస్టర్ ప్లాన్ మార్పు జరిగిందన్నారు. రామానాయుడు స్టూడియోలో ఇళ్ల కోసం లే అవుట్ వేసారని తెలిపారు.  టీడీపీ సానుభూతి పరుల ఓట్లను ఇష్టానుసారంగా తొలగించారని ఆరోపించారు.
ఫార్మ్ -7 పెట్టేందుకు 149 వ్యక్తులు పనిచేశారని, కొత్త ఓట్లతో డబుల్ ఎంట్రీలు జరిగాయన్నారు. దొంగ ఓట్లను ఇష్టానుసారంగా చేర్చారని, v
ఓకే బూత్ లో డూప్లికేట్ ఎపిక్ నంబర్లు ఎంట్రీ చేశారని మండి పడ్డారు. వీటిపై  కలెక్టర్ కు  ఎమ్మెల్యే గణబాబు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజులతో కలిసి ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. వైసీపీ నేతలు చెప్పినట్టుగా కలెక్టర్ మల్లిఖార్జున పని చేయడం వల్లే ఇవన్నీ జరిగాయని ఆరోపించారు. రానున్న ఎన్నిక ప్రక్రియ సజావుగా జరగాలంటే కలెక్టర్ మల్లిఖార్జునను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో స్థానిక టిడిపి నేతలు కూడా పాల్గొన్నారు.