Current Date: 02 Jul, 2024

Distribute the kits even if there is a photo of Jagan.. CM Chandrababu orders...

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మార్కు పాలన మొదలైంది. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పాలనలో మార్పు చూపించారు. ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు, పగ  ఉండవని నిరూపించారు. రాష్ట్రంలో స్కూల్స్ పున:ప్రారంభమైన నేపథ్యంలో జగన్ ఫొటో ఉన్నా సరే విద్యార్థులకు ఆ కిట్ లనే పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఎంత తేడా అంటూ తెలుగుదేశం పార్టీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరొస్తుందని, వైఎస్ జగన్ తన హయాంలో పేదలకు తక్కువ ఖర్చుతో అన్నం పెట్టే  అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టాడని పేర్కొంది.

Share