ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బలం, బలహీనత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన ధోనీ యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కి పగ్గాలు అప్పగించాడు. అయితే.. తన మొదటి నుంచి పోషిస్తున్న ఫినిషర్ రోల్‌కి మాత్రం పూర్తి స్థాయిలో ధోనీ న్యాయం చేయడం లేదనేది వాస్తవం.
హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకూ క్రీజులోకి రాని ధోనీ.. లాస్ట్‌లో వచ్చినా చేసింది ఒక్క పరుగే. గత ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివర్లో హిట్టింగ్ చేసినా.. అప్పటికే బంతులు, పరుగుల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. దాంతో ధోనీ హిట్టింగ్ అభిమానుల్ని అలరించేదే తప్ప.. చెన్నై టీమ్‌ని గెలిపించలేకపోయింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ధోనీ ఇంకాస్త ముందు బ్యాటింగ్‌కి వచ్చింటే చెన్నై గెలిచేది.
మ్యాచ్‌ల్లో ధోనీ 7వ స్థానంలో బ్యాటింగ్‌కి వస్తున్నాడు. అప్పటికే టీమ్‌లోని బ్యాటర్లు బంతుల్ని వృథా చేస్తున్నా బాధ్యతగా కాస్త బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రావాలని మునపటిలా ధోనీ అనుకోవడం లేదు. తాత్సారం చేస్తూ చివరి వరకూ వెయిట్ చేస్తున్నాడు. ఒకవేళ ధోనీ 15-16 ఓవర్‌లో బ్యాటింగ్‌కి వస్తే కనీసం 20 బంతులైనా ధోనీ ఆడే అవకాశం లభిస్తుంది. ఫినిషర్‌గా ఓ మోస్తరు హిట్టింగ్ చేసినా ధోనీ కనీసం 40-50 పరుగులు డెత్ ఓవర్లలో చేసే అవకాశం ఉంటుంది. కానీ.. చెన్నై ఇప్పటికే 4 మ్యాచ్‌లు ఆడినా.. అన్ని మ్యాచ్‌ల్లో కలిపి ధోనీ ఎదుర్కొన్న బంతులు 18 మాత్రమే. అందుకే ధోనీ కాస్త ముందుగా బ్యాటింగ్‌కి వస్తే మంచిదని చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్ చెప్తున్నా.. ధోనీ మాత్రం ససేమేరా అంటున్నట్లు తెలుస్తోంది.