Current Date: 07 Oct, 2024

బ్రిటన్ ప్రతిపక్షనేత మనమ్మాయే!!!

విదేశీ గడ్డ మీద భారత మూలాలు ఉన్న వారి పాత్ర కీలకంగా మారుతున్న సంగతి చూస్తున్నాం. అగ్రరాజ్యంతో పాటు.. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. మొన్నటివరకు బ్రిటన్ ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ వ్యవహరించటం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమిపాలు కావటం సుదీర్ఘ విరామం తర్వాత లేబర్ పార్టీ అధికారపక్షంగా అవతరించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా యూకే ప్రతిపక్ష నేతగా భారత సంతతికి చెందిన 52 ఏళ్ల ప్రీతి పటేల్ కానున్నారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.  ప్రతిపక్ష నేత పదవికి ఆమె పోటీ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విథామ్ నుంచి పార్లమెంట్ కు ఆమె ఎన్నికయ్యారు. ఉగాండాలో స్థిరపడి బ్రిటన్ కు వలస వచ్చిన గుజరాతీ సంతతి తల్లిదండ్రులకు ఆమె జన్మించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ఓటమి నేపథ్యంలో మాజీ ప్రధానమంత్రి రిషి తాత్కాలిక ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Share