Current Date: 27 Nov, 2024

‘గుడివాడ’ బృందానికి ఝలక్ !

అనకాపల్లి జిల్లా విస్సన్నపేట భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వీఎంఆర్‌డీఏ రూఢీ చేసుకుంది. అప్పటి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ బ్యాచ్‌ అక్రమ లే అవుట్‌లపై జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై విశాఖ మెట్రోపాలిటెన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌ కేఎస్‌.విశ్వనాథన్‌ స్పందించారు. వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విసన్నపేట గ్రామంలో సర్వే నంబర్‌ 2,108,195/2, 624 సమీపంలోని 610ఎకరాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులేవీ పొందకుండా వేసిన అక్రమ లే అవుట్‌లో గృహ (ప్లాట్స్‌) విక్రయాలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అదే విధంగా విస్సన్నపేటలో వైశాఖీ వ్యాలి పేరుతో కొత్తగా బ్రోచర్లు విడుదల చేసి ప్లాట్ల విక్రయ వ్యాపారం చేస్తున్న అంశాన్ని ఇటీవలే జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. అంతే కాకుండా మహా విశాఖ నగర అభివృద్ధి సంస్థ చట్టం 2016కు విరుద్ధంగా, సెక్షన్‌ 82(1), (2), సెక్షన్‌ 83, 84, సెక్షన్‌ 88 (2), సెక్షన్‌ 89(1), (2), సెక్షన్‌ 89(4)ద్వారా ఉల్లంఘనకు పాల్పడినట్టు వీఎంఆర్‌డీఏ గుర్తించింది. 

Share