Current Date: 28 Nov, 2024

గుడివాడ కాంప్లెక్స్ కూల్చివేతకు రంగం సిద్ధం నోటీసులు జారీ చేసిన జీవీఎంసీ

వైసీపీ నాయకుడు గుడివాడ అమరనాధ్ మింది లో అక్రమంగా నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్ ను తొలగించాలని జీవీఎంసీ సోమవారం నోటీసు లు జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ లోని   రోడ్డు విస్తరణ కు అనుగుణంగా నిబంధన లు పాటించ లేదని,ఎటువంటి లైసెన్స్ ఫీజు కూడా చెల్లించలేదని అందువల్ల బిల్డింగ్ ను తొలగించాలని నోటీసు లో జీవీఎంసీ తెలిపింది. బిల్డింగ్ ప్లాన్ తీసుకునేటప్పుడు మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా 46.92 చదరపు గజాల స్థలాన్ని జీవీఎంసీ కి గిఫ్ట్ గా రాసి ఆ స్థలానికి టీడీఆర్   ఇవ్వాలని దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే ఆన్ లైన్ లో బిల్డింగ్ ప్లాన్ ప్రతి పాదన వున్నా ఇప్పటికీ ప్లాన్ పొందలేదని జీవీఎంసీ తెలిపింది. 1236 రోజుల నుంచీ ఈ ప్లాన్ పెండింగ్ లోనే ఉందని, కాగా గిఫ్ట్ డీడ్ ఇచ్చిన భూమిలో కూడా నిర్మాణాలు జరిగాయని జీవీఎంసీ తెలిపింది. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా కాకుండా అన్ని పక్కలా సెట్ బ్యాక్ లు వున్నాయని, అంతే కాకుండా రోడ్డు విస్తరణ స్థలం లో అక్రమంగా నిర్మాణం జరిగిందని జీవీఎంసీ ఈ నోటీసు లో వెల్లడించింది. 

Share