Current Date: 05 Oct, 2024

'ఏపీ విజయం సామాన్యుడి ఆకాంక్షకు ప్రతిరూపం'

ఏపీ తమకు అతిపెద్ద విజయం అందించిందని మోదీ వ్యాఖ్యానించారు. ఆ విజయం సామాన్యుడి ఆకాంక్షకు ప్రతి రూపం అని చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించారు. పవన్ అంటే పవనం కాదు.. సునామీ అని వ్యాఖ్యానించారు. ప్రజల కలలను సాకారం చేసే విధంగా ఎన్డీయే పని చేస్తుందని తెలిపారు.