మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న 4136 మంది అభ్యర్థుల భవితవ్యం శనివారం ఈ రోజు తేలనుంది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సన్నాహాలు పూర్తి చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపునకు 6,500 కౌంటింగ్ టేబుల్స్ సిద్ధంగా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు దాదాపు 4వేలు, ఈవీఎం టేబుల్స్, 2,500 టేబుల్స్‌పై జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా కౌంటింగ్ కేంద్రం లోపలికి ఎవరిని అనుమతించరు. ప్రతి టేబుల్‌ను అభ్యర్థి కౌంటింగ్ ఏజెంట్లు సందర్శించవచ్చు. ఎన్నికల ప్రక్రియ అంతా సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ట్రెండ్లు ప్రారంభమవుతాయి. సాయంత్రం 4 గంటలకు ఎవరిది విజయం అనేదానిపై స్సష్టత రానుంది.