భారత సీనియర్ క్రికెటర్ హార్దిక్ పాండ్య తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. పరస్పర అంగీకారంతో నాలుగేళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వీరికి మూడేళ్ల కుమారుడు అగస్త్య ఉండగా.. ఆ అబ్బాయిని తీసుకొని ముంబయి నుంచి నటాషా వెళ్లిన గంటల వ్యవధిలో హార్దిక్ తమ విడాకులు విషయాన్ని అభిమానులకి తెలియజేశాడు. హార్దిక్-నటాషా ప్రేమ, పెళ్లి ఎంత హడావుడిగా జరిగిపోయాయో.. అందే స్పీడ్‌తో విడాకులు కూడా తీసుకున్నారు. 2018లో హార్దిక్ పాండ్య తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన పార్టీలో తొలిసారి ఇద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లుబెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ.. 2020 జనవరి 1న నటాషా ప్రేమను గెలుచుకున్నట్లు హార్దిక్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఆ తర్వాత లాక్‌డౌన్‌లో పెళ్లి గురించి ప్రస్తావించకుండానే 2020 జులైలో ఆగస్త్యకు జన్మనిచ్చారు. బిడ్డ పుట్టిన తర్వాతే వివాహం చేసుకున్నారు.'నాలుగు సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత నటాషా, నేను విడిపోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నాం.