Current Date: 07 Oct, 2024

ప్రభాస్ ఫ్యాన్స్‌ని మళ్లీ కెలికిన వేణుస్వామి

జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. ఏపీ ఎన్నికల్లో ఆయన అంచనా తప్పడంతో కొద్ది కాలం ఇంటర్వ్యూలకి దూరంగా ఉన్నారు. అయితే అప్పుడప్పుడు మాత్రం సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్‌కి గట్టిగానే సమాధానమిచ్చారు. అయితే చాలా రోజుల తర్వాత మరోసారి ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు వేణుస్వామి.వైయస్ జగన్ గురించే కాదు.. ప్రభాస్ గురించి కూడా వేణుస్వామి వేసిన అంచనాలు ఫెయిలయ్యాయి. బాహుబలితోనే ప్రభాస్ కెరీర్ ముగిసిపోయిందని.. ఇక అతనికి హిట్స్ రావని అప్పట్లో స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చేశారు. అదే విషయాన్ని తాజాగా మరోసారి ప్రస్తావిస్తూ ‘‘ బాహుబలి 2 తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయ్ కదా.. మరి అప్పుడు నేను చెప్పింది నిజమైందని ఎవరైనా వచ్చి నా మెడలో దండేశారా? నాకు కిరీటాలు పెట్టారా? ఇక సలార్ చిత్రం హిట్ అంటూ ఫ్యాన్స్ తెగ ఎగిరారు కదా? అది నిజంగా హిట్టా?సలార్‌కి 135 కోట్లు లాస్ వచ్చింది. ఈ విషయం ఎవరైనా చెప్పారా? ఇక కల్కి చిత్రం బ్లాక్ బస్టర్ అంటున్నారు కదా? అందులో హీరో ఎవరు.. ప్రభాస్ ఎంతసేపు స్క్రీన్ మీద కనిపించారు. ఆ సినిమా చివరికి నిర్మాతకి ఎన్ని డబ్బులు తెచ్చిపెడతాయో చూద్దాం.

Share