Current Date: 28 Nov, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం మూడురోజులు దంచికొట్టనున్న వానలు

మరికొన్ని గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక హెచ్చిరికలు జారీ చేసింది. భారతీయ వాతావరణశాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక హెచ్చిరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సహాయం కోసం హెల్ప్‌ లైన్ నంబర్స్ కూడా అందించింది. మరోవైపు ఈనెల 19న పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రుతుపవన ద్రోణి తూర్పు భాగం ఒడిశా నుంచి శ్రీకాకుళం జిల్లా మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని.దీని కారణంగా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

Share