ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి పెద్ద ప్రమాదం తప్పింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
అక్కడ తిరుణాళ్ల(పోలేరమ్మ కొలుపులు)కి హాజరయ్యారు. అక్కడే ఓ ఎద్దు మంత్రిపై దాడి చేసింది. తిరుణాళ్లలో ప్రదర్శనకు ఉంచిన ఎడ్లబండ్ల దగ్గర స్థానిక నేతలు, మంత్రితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దాంతో బెదిరిన ఒక ఎద్దు పైకి ఎగిరి
మంత్రిని తలతో ముందుకు నెట్టింది. ఈ ఘటనలో మంత్రి స్వామి ముందుకు బోర్లా పడిపోగా.. ఆయన్ను ఎద్దు ముందు కాళ్లతో బలంగా తొక్కింది. అప్రమత్తమైన గన్‌మెన్‌లు, టీడీపీ నేతలు ఎడ్లను అడ్డుకొని మంత్రిని ప్రమాదం నుంచి తప్పించారు. ఈ ఘటన తర్వాత మంత్రి స్వామి టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని నివాసానికి వెళ్లారు. అక్కడ స్వామికి వైద్యులు చికిత్స అందించారు. డీజే శబ్ధాల కారణంగా ఎద్దులు బెదిరి మంత్రి మీదికి తీసుకొచ్చాయని స్థానికులు చెబుతున్నారు.