Current Date: 06 Oct, 2024

అభిమానులకు స్వయంగా భోజనం వడ్డించిన చియాన్ విక్రమ్

కోలీవుడ్ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతుండడంతో మూవీ మేకర్స్ ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. తాజాగా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఇందులో భాగంగా చిత్రయూనిట్ సభ్యులు, అభిమానులతో కలిసి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు చియాన్ విక్రమ్ తో సహా తంగలాన్ యూనిట్ సభ్యులు, విక్రమ్ అభిమానులు కూడా భారీగా ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా తంగలాన్ సక్సెస్ మీట్ కు సంప్రదాయమైన పంచెకట్టులో హాజరయ్యాడు విక్రమ్. ఈ సక్సెస్ మీట్ హాజరైన అభిమానులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సంద్భంగా సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అయిన హీరో విక్రమ్ తన అభిమానులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఒక్కొక్కరినీ పేరు పేరునా పలకరిస్తూ వంటకాలు వడ్డించారు.

Share