Current Date: 27 Nov, 2024

టీమిండియా కొత్త కోచ్‌ గంభీర్‌కి బీసీసీఐ పరీక్ష!

భారత జట్టు కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి బీసీసీఐ చుక్కలు చూపిస్తోంది. ఈ నెల 9న హెడ్ కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. కానీ ఇప్పటికీ సహాయ కోచ్‌ల విషయంలో క్లారిటీ రాలేదు. వాస్తవానికి హెడ్‌ కోచ్‌ తనకు నచ్చినవారిని సహాయ కోచ్‌లుగా తీసుకుంటూ ఉంటారు. గతంలో రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలు కూడా ఇలానే చేశారు. కానీ.. గంభీర్‌ కండీషన్‌‌కి బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. సహాయ కోచ్‌ల కోసం గంభీర్‌ ఇప్పటివరకు ఆరుగురి పేర్లు సిఫార్సు చేయగా.. అందులో ఐదుగురిని బీసీసీఐ తిరస్కరించింది. మరొకరి పేరును పెండింగ్‌లో పెట్టింది. గంభీర్‌ టీమిండియా బౌలింగ్‌ కోచ్‌లుగా వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను సూచించాడు. అందులో ఒకర్ని తీసుకోవాలని భావించాడు. ఇక బ్యాటింగ్‌ విషయంలో అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డస్కాటే పేర్లు సిఫార్సు చేశాడు. ఫీల్డింగ్‌ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేరును బీసీసీఐ ముందుంచాడు.  కానీ బీసీసీఐ ఎటూ తేల్చక గంభీర్‌ సహనాన్ని పరీక్షిస్తోంది.

Share