Current Date: 11 Oct, 2024

బాలీవుడ్ హీరోయిన్ చేతిలో అప్పట్లో మోసపోయిన రతన్ టాటా

ఇండియా దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యులు పెద్దగా కనిపించకపోవడంతో అతని ఫ్యామిలీ గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. అయితే వైవాహిక జీవితానికి టాటా ఆఖరి వరకూ దూరంగా ఉండిపోయారు. వాస్తవానికి టాటా యువకుడుగా ఉన్న సమయంలో ఓ హీరోయిన్ దారుణంగా మోసం చేసిందట. బాలీవుడ్ నటి సిమి గరేవాల్‌, రతన్ టాటా ఇద్దరు ప్రేమించుకున్నారని అప్పట్లో వార్తలు వెలిశాయి. వీరిద్దరు కొంతకాలం డేటింగ్ చేసినప్పటికీ, దాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లలేకపోయారు. సిమి గరేవాల్‌ రతన్ టాటాతో పాటు మరో ఇద్దరితో ప్రేమయాణం సాగించిందట. ఆ జాబితాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తండ్రి కూడా ఉండటం విశేషం. కానీ ఆఖరికి సిమి గరేవాల్‌ ఇద్దరినీ కాదని మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే సిమి గరేవాల్‌‌ అవకాశం చిక్కినప్పుడల్లా రతన్ టాటాపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటుంది. రతన్ టాటాతో తన రిలేషన్‌‌పై సిమి అగర్వాల్ ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. రతన్ టాటా పర్ఫెక్ట్ జెంటిల్‌మెన్. ఆయన సంపూర్ణుడు. కానీ.. ఎందుకో మా మధ్య ప్రేమ తగ్గిపోయింది. అందుకే పెళ్లి చేసుకోలేదని సిమి అగర్వాల్ చెప్పుకొచ్చింది.

Share