తమిళ్ హీరో విజయ్ నాయకత్వంలో తమిళిగా వెట్రి కగజం అనే పేరుతో ఇటీవల ప్రాంతీయ పార్టీ అవతరించగా.. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకోవాలని విజయ్ ఆశిస్తున్నాడు. కానీ.. జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని విజయ్ ప్రకటించాడు. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు సహజంగా ఎన్నికలు ఎప్పుడెప్పుడా వస్తాయా అని ఎదురు చూస్తుంటాయి. కానీ తమిళనాడులో మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపిస్తోంది. ప్రముఖ తమిళ హీరో విజయ్ మాత్రం జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పడం చర్చనీయాంశమైంది. ఒకవేళ 2026లో తాను అధికారంలోకి వస్తే, ఆ తర్వాత ఏడాదికే జమిలి ఎన్నికలు జరిగితే ఎలా? అనేది ఆయన ప్రశ్న తమిళనాడులో ద్విభాషా సిద్ధాంతం అమల్లో వుండాలన్నారు. హిందీకి వ్యతిరేకంగా తీర్మానించడం గమనార్హం. ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడులో హిందీ భాషకు చోటు ఇచ్చేది లేదని తీర్మానించడం గమనార్హం. ఏపీలో పవన్ కళ్యాణ్ తరహాలో తమిళనాడులోనూ తన మార్క్‌ని సృష్టించాలని విజయ్ ఆశిస్తున్నాడు.