Current Date: 21 Sep, 2024

హిట్ కొట్టాకే మళ్లీ కనబడతా నాగార్జున కొడుకు అఖిల్ శపథం

అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ మొదటి సినిమా 'అఖిల్‌' విడుదల అయ్యి పదేళ్లు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్‌ హిట్‌ను కూడా కొట్టలేకపోయాడు. అలానే రెండేళ్లకి ఒకటి అన్నట్లుగా సినిమాలు చేస్తున్న అఖిల్ ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌లో వంశీ, ప్రమోద్‌ లు నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఏఎన్నార్‌ శత జయంతి వేడుక సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యాన్స్ తో భారీ వేడుక నిర్వహించారు. అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ పలువురు ఈ వేడుకలో పాల్గొనగా అఖిల్‌ కనిపించకపోవడంతో ప్యాన్స్ అయ్యగారు ఎక్కడ అంటూ నినాదాలు చేశారు. దీంతో నాగార్జున మైక్ అందుకుని "అఖిల్‌ హిట్ కొట్టిన తర్వాతే మీ ముందుకు వస్తాను అని చెప్పమన్నాడు. వచ్చే ఏడాది హిట్‌ కొట్టి మీ ముందుకు వస్తాడు" అంటూ నాగార్జున ఫ్యాన్స్‌ను ఉద్దేశించి చెప్పారు.

Share