Current Date: 21 Sep, 2024

కడప యాసలో జగన్ వెటకారం నాయకులకి సంకేతం

ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నాయ‌కులు చాలా మంది పార్టీని వీడుతున్నారు. టీడీపీ లేదా జనసేనలోకి జంప్ అయిపోతున్నారు. చివరికి జగన్‌కు అత్యంత దగ్గరి బంధువు బాలినేని కూడా జనసేనలోకి వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా మీడియా ప్ర‌తినిధులు సీనియ‌ర్ నాయ‌కులు పార్టీ మారుతున్నార‌ని, మీ స్పంద‌న ఏంటి? అని జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు.ఆ ప్రశ్నకి కడప యాసలో జగన్ వెటకారంగా సమాధానం ఇచ్చారు. “యా సీనియ‌ర్లు పోతాండారు. ఎవ‌రు పోతాండారు? ఏమ‌వుతాంది?” అంటూ స్పందించారు. మీడియా ప్ర‌తినిధులు ప్ర‌త్యేకంగా బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి పేరు ప్ర‌స్తావించారు. దాంతో “పోనీలే. ఏమైతాది. ఇంకొక‌రు వ‌స్తారు” అని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. లీడ‌ర్ అనేవాడు ప్ర‌జ‌ల నుంచి పుడతాడ‌ని గుర్తించుకోవాల‌ని చెప్పకొచ్చారు.వైసీపీ నాయ‌కుల పార్టీ మార్పు ఏమంత పెద్ద విష‌యం కాద‌న్న‌ట్టు, ఆయ‌న లైట్ తీసుకున్న‌ట్టు త‌న మాట‌ల ద్వారా తెలుస్తోంది. జ‌గ‌న్‌లో మార్పు రాక‌పోవ‌డం వ‌ల్లే పార్టీ మారిన‌ట్టు బాలినేని చెప్పిన సంగ‌తి తెలిసిందే. దాంతో పార్టీ నుంచి వెళ్లిపోయేవారిని ఎవరినీ ఆపబోమని జగన్ తన మాటల ద్వారా సంకేతాలిస్తున్నట్లు కనిపిస్తోంది.

Share