Current Date: 28 Nov, 2024

సీఎండీ అతుల్ భట్ కృషి తో హైకోర్టు ఉత్తర్వులు విడుదలైన బొగ్గు నిల్వలు ఉక్కుకు మళ్ళీ ఊపిరి

 విశాఖ స్టీల్ ప్లాంట్ కు కాస్త ఊరట లభించే వార్త ఇది. విశాఖ పోర్ట్ లో ఉన్న బొగ్గు నిల్వల్ని స్టీల్ ప్లాంట్ కు ఇచ్చేయొచ్చంటూ హైకోర్టు ఆదేశాలివ్వడంతో విశాఖ ఉక్కుకు మళ్లీ ఊపిరి వచ్చినట్టయింది. ఉక్కు సీఎండీ అతుల్ భట్  అహర్నిశలూ కష్ట పడి చేసిన ప్రయత్నాలు ఫలించ్చాయి.   ఉక్కు నిర్వహణ పై సమన్వయం కోసం  పని చేసేందుకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఇద్దరు ఐఏఎస్ అధికారులను ఏర్పాటు చేసింది.బకాయిలు చెల్లిoచకపోవడంతో విశాఖ పోర్టు లో స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన బొగ్గు నిల్వలు అక్కడే ఉండి పోయాయి.గురువారం రాత్రి 49,350టన్నుల నిల్వల అటాచ్ మెంట్ ను కోర్ట్ క్లియర్ చేసింది. ఇక గంగవరం పోర్టులో ఉండిపోయిన 58,780టన్నుల బొగ్గు కు కూడా విముక్తి లభించింది.. ఎన్ఎండీసీ నుంచి రావాల్సిన బకాయిలు కూడా ఉక్కుకు జమ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఉక్కు ఉత్పత్తి పై మళ్ళీ ఆశలు చిగురుంచాయి

Share