ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 'ఉపాధి హామీ చట్టం' పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్రవ్యాప్త యాత్రకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చడాన్ని, నిబంధనల్లో మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచి ఆమె తన పోరాటాన్ని ప్రారంభించనున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ పథకం ఇదే గ్రామం నుంచి ప్రారంభం కావడం విశేషం. ఈ యాత్రకు సంబంధించి షర్మిల ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆమె చేసిన విన్నపానికి రాహుల్ సానుకూలంగా స్పందించారని, ఆయన బండ్లపల్లి సభకు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ రాహుల్ హాజరైతే, ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోసినట్లవుతుందని షర్మిల భావిస్తున్నారు. జగన్ పాదయాత్ర ప్రకటనపై షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని వారు, ఇప్పుడు ఏడాదిన్నర ముందే యాత్ర గురించి ప్రకటించడం రాజకీయ లబ్ధి కోసమేనని ఆమె ఆరోపించారు.
Share