Current Date: 08 Oct, 2024

చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్

వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఎన్నికల కౌంటింగ్ సమయంలో మోహిత్, ఆయన అనుచరులు దాడి చేశారు. దీంతో మోహిత్ రెడ్డి పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి,బెంగళూరు ఎయిర్పోర్టు నుండి విదేశాలకు పారిపోతుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా గత ఎన్నికల్లో మోహిత్ చంద్రగిరి నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

Share