Current Date: 28 Nov, 2024

కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఫార్మా పరిశ్రమలు

ఒకవైపు భద్రత లోపం   మరోపక్క కాలం చెల్లిన నాణ్యత లోపమైన పరికరాల వాడకం.. తరచూ ఫార్మా పరిశ్రమల్లో ఏదో ఒక ఘటన జరగటానికి ఫార్మా పరిశ్రమల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఫార్మా పరిశ్రమల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులు తమ జీవితాలను అరిచేతిలో పెట్టుకుని పని చేయ వలసిన పరిస్థితి. కార్మికుల జీవితాలతో జవహర్లాల్ నెహ్రు ఫార్మా యాజమాన్యాలు చెలగాటలాడుతున్నాయని సిఐటియు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫార్మా కంపెనీలో పనిచేసే కార్మికులకు భద్రతా విషయంలో పలు ఫార్మా పరిశ్రమలు అలస్తత్వం వహిస్తున్నాయని, కార్మికులు ఏమైపోయినా పర్వాలేదు.. ఫార్మా యాజమాన్యాల జేబులు నిండితే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఫార్మా పరిశ్రమల పద్ధతి కార్మికు లలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికైనా ఫార్మా పరిశ్రమల యాజమాన్యా ల తీరు మార్చుకోకపోతే. ముందు ముందు మరి కొంతమంది ఉద్యోగులు, కార్మికు లు ఫార్మా పరిశ్రమలకి బలయిపోయే ప్రమాదం ఉందని కార్మికుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Share