Current Date: 05 Oct, 2024

ఆ మీసాల పవరే వేరు.. వంద కోట్ల విజయం

ఆ మీసాలకు పవర్ ఉంది.... ఎన్ని వందల కోట్ల రూపాయలైనా ఆ మీసాల ముందు బలాదూర్. డబ్బుతో ఆ మీసాల విలువను కొనలేరు. ఈ ఎన్నికల్లో అందరికీ కనువిప్పు కలిగింది అదే. విశాఖ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు మీసాలకు ఎంత పవర్ ఉందో ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. దాన్ని అర్థం చేసుకోలేని ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ టికెట్ మీద పోటీ చేసి బొక్క బోర్లా పడిపోయారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వెలగపూడిపై సునాయాసంగా గెలిచేయవచ్చని ఎంవీవీ భావించారు. ఎందుకంటే గతఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసి 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విశాఖ ఎంపీగా సునా యాసంగా గెలిచేశారు. అప్పట్లో జనసేన పార్టీ టికెట్పై పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనా రాయణ కు భారీ ఓట్లు పడటంతో టీడీపీ ఓట్లు చీలిపోయాయి. దీంతో అతి తక్కువ మెజార్టీతో ఎంవీవీ బయటపడి విశాఖ ఎంపీ అయి పోయా రు.