ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. అనకాపల్లి జిల్లా కె. కోటపాడు మండలం ఆలమండలో 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం ఎ. కోడూరులో స్థానికులతో ముఖాముఖిలో పాల్గొంటారు. తరువాత పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత విశాఖపట్నంలో జరిగే బ్రిక్స్ యువజన, క్రీడల మంత్రుల సమావేశంలో పాల్గొంటారు.
Share