మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కవల పిల్లలకు పేర్లు ఖరారు చేశారు. జనవరి 31న జన్మించిన ఈ చిన్నారులకు ఆధ్యాత్మిక, కుటుంబ వారసత్వం ఉట్టిపడేలా పేర్లను ఎంపిక చేశారు. కుమార్తె పేరు: అన్వీరా దేవి. అంటే ధైర్యవంతురాలైన అమ్మవారు అని అర్థం. కుమారుడి పేరు: శివరామ్ ఇందులో చిరంజీవి అసలు పేరు శంకర్ వరప్రసాద్ లోని 'శివ', రామ్ చరణ్ పేరులోని 'రామ్' కలిసేలా ఈ పేరును ఎంపిక చేశారు. ఇప్పటికే రామ్ చరణ్, ఉపాసనలకు క్లింకార అనే కుమార్తె కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కవలల రాకతో మెగా కుటుంబంలో సందడి నెలకొంది.
Share