విశాఖ జిల్లా వాల్తేర్ రైల్వే డివిజన్ డీఆర్ఎంగా పని చేస్తున్న సౌరబ్ ప్రసాద్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం సెలవులో ఉన్న సౌరభ్ ప్రసాద్ లంచం డబ్బును ముంబైలో తన ఇంటికి వచ్చి ఇవ్వాలని సూచించాడు. దాంతో కాంట్రాక్టర్ ముంబై వెళ్లి రూ.25లక్షలు లంచం ఇస్తుండగా, సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇదే క్రమంలో ఇటు విశాఖలోని డీఆర్ఎం బంగ్లాలో సీబీఐ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సీబీఐ సోదాలు జరిపింది. ఢిల్లీ, విశాఖకు చెందిన రెండు బృందాలు ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తొంది. లంచం తీసుకుంటూ దొరికిపోయిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.