కేఎల్ రాహుల్ బిగ్ ట్విస్ట్.. లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడాలని ఆలోచన
Oct 25, 2024
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. తాను కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌తో కొనసాగడంపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని సమాచారం. లక్నో రిటెన్షన్ ఆఫర్‌పై అతడు ఏమీ చెప్పలేదని కథనాలు వెలువడుతున్నాయి. కేఎల్ రాహుల్ ఇటీవల లక్నో జట్టు యజమానులతో సమావేశమయ్యాడని, అయితే కొనసాగించాలని ఫ్రాంచైజీ ఎంచుకున్నప్పటికీ అంగీకరించాలా? వద్దా? అనే దానిపై అతడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ‘ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో’ కథనం పేర్కొంది. రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించేందుకు ఇంకా వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో రాహుల్ తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారిందని తెలిపింది.