Current Date: 02 Apr, 2025

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం...

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ వరకు జరుగుతాయి. ఆలయ గోపురానికి బంగారు తాపడం అనంతరం వచ్చిన బ్రహ్మోత్సవాలు ఇవి. ఈ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మొదటిరోజు శ్రీ విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం పూజలు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదట గర్భాలయంలోని స్వయంభు నారసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

Share