Current Date: 02 Apr, 2025

మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వమా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ ప్రభుత్వం గౌరవం పౌరసత్వం ఇస్తోందంటూ వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆయన యూకే పౌరసత్వం స్వీకరించబోతున్నారని ఆయా కథనాల్లో పేర్కొన్నారు. దీనిపై చిరంజీవి పీఆర్ టీమ్ స్పందించింది. చిరంజీవి గారు బ్రిటన్ దేశపు గౌరవ పౌరసత్వం అందుకోబోతున్నారంటూ వస్తున్న కథనాల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఇటువంటినిరాధార వార్తలు ప్రచురించేటప్పుడు మీడియా సంస్థలు ఓసారి నిర్ధారణ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Share