సాలూరు పట్టణంలో శ్రీశ్రీశ్రీ బాల త్రిపుర సుందరి శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయంలో నూట ఒక్క మందికి సామూహికంగా ఉపనయన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సనాతన ధర్మ పరిషత్ ఫౌండర్ అయిన పంచముఖేశ్వర శర్మ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం రెండు జిల్లాలకు సంబంధించి అన్ని కులస్తులకు ఒడుగు ఉన్న పేదవారిని దృష్టిలో పెట్టుకొని సనాతన ధర్మ పరిషత్ తరపున సామూహిక స్వధర్మ వేదిక ఏర్పాటు చేయడం, పూజా సామాగ్రి కూడా కొనుక్కోలేని వారికి సనాతన ధర్మ పరిషత్ తరఫున వారికి కొని ఇవ్వడం జరిగినదని తెలిపారు. నూట ఒక్క మంది కి ఉపనయనము చేయడం జరిగినదని వారి తల్లిదండ్రులకు వారితో పాటు వచ్చిన కుటుంబ సభ్యులకు అన్న సమారాధన ఏర్పాటు చేయడమైనదని తెలియజేశారు. కోటి శర్మ వినయ్ శర్మ విజయ్ శర్మ బ్రహ్మాజీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. సనాతన ధర్మ పరిషత్ కమిటీ సభ్యులు, లలితా పారాయణం సభ్యులు సహకరించారు.
Share