రాష్ట్రంలనే అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయిన గుడివాడ అమర్‌నాథ్‌కు ఇప్పుడు వైసీపీ సిటీ అధ్యక్ష పదవి కావాలంట. మొన్న జరిగిన ఎన్నికల్లో అమర్‌నాథ్‌కు తన పక్కింటి వాళ్లు కూడా ఓటేయలేదు. మంత్రిగా వెలగబెట్టిన రెండున్నరేళ్లలో ఇబ్బడిముబ్బిడిగా అవినీతికి పాల్పడి ఎక్కడికక్కడ దోచుకున్నారన్న పేరును కూడా మూటగట్టుకున్నారు. ఇలాంటి నాయకుల వల్లనే వైసీపీ ఉత్తరాంధ్రలో ఊడ్చుకుపోయింది. మళ్లీ ఇప్పుడు తగుదునమ్మా అంటూ విశాఖ పార్టీ బాధ్యతల్ని తీసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. నిన్న జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతోత్సవ సన్నాహక కమిటీ సమావేశం సందర్భంగా గుడివాడ అనూయాయులు కొంతమంది ఈ ప్రస్తావన తెచ్చారు. అయితే మళ్లీ అమర్‌నాథ్‌ను నెత్తిమీద పెట్టుకుంటే ప్రజలకు మొహం చూపించే పరిస్థితిని కోల్పోతామని మిగిలిన నాయకులు చెప్పకనే చెప్పేశారు. మంత్రిగా ఉండగా నళ్ల కళ్లద్దాలు తీసిన పాపాన పోలేదు. దీంతో పార్టీలో నాయకులందరూ గుడివాడకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఒక పక్క అమర్‌నాథ్ మీద గెలిచిన టీడీపీ నాయకుడు పల్లా శ్రీనివాస్ ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైపోయారు. దీన్ని చూసి అమర్‌నాథ్ మరీ తట్టుకోలేకపోతున్నారట.