Current Date: 05 Oct, 2024

ఇంగ్లండ్ దిగ్గ‌జ క్రికెట‌ర్ గ్రాహం థోర్ప్ క‌న్నుమూత‌

ఇంగ్లండ్ దిగ్గ‌జ క్రికెట‌ర్ గ్రాహం థోర్ప్ క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని ఇంగ్లండ్ అండ్‌ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గ్రాహం థోర్ప్ ఇక‌లేర‌నే వార్త చాలా బాధ క‌లిగించింది. ఇంగ్లండ్ అత్యుత్తమ బ్యాటర్లలో ఆయ‌న ఒక‌రు. ఆయ‌న‌ క్రికెట్ కుటుంబానికి ప్రియమైన సభ్యుడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో గౌరవించబడ్డాడు. ఆయ‌న మృతితో క్రికెట్ ప్రపంచం నేడు శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయ‌న‌ భార్య అమండా, పిల్లలు, తండ్రి జియోఫ్, కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ ప్ర‌గాఢ‌సానుభూతి" అని ఈసీబీ త‌న‌ ప్రకటనలో పేర్కొంది.

Share