Current Date: 06 Jul, 2024

ఇల్లెక్కిన ఆటో... అసలు విషయం తెలిస్తే శభాష్‌ అంటారు....

సొంత ఇల్లు కట్టుకోవడం ప్రతిఒక్కరి జీవితంలో వారి చిరకాల స్వప్నం. ప్రతి పైసా పొదుపు చేసి అందమైన ఇల్లు కట్టుకోవాలని చాలా మంది కలలు కంటారు. దీని కోసం ప్రజలు చాలా సంవత్సరాల పాటు కష్టపడి డబ్బు ఆదా చేసి ఇళ్ళు నిర్మించుకుంటారు. ఓ ఆటోడ్రైవర్ కూడా డబ్బులు పోగుచేసి అందమైన ఇల్లు కట్టుకున్నాడు. ఆటోపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న అతడు తన సంపాదనతో కొత్త ఇల్లు కట్టుకున్నాడు. అయితే, సొంతింటి కల నేరవేర్చిన ఆటోను తన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకున్నాడు.. అందుకోసం అతడు చేసిన పని తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అది చూసిన జనాలు ఆశ్చర్యపోయారు. అతడి ఔనత్యాన్ని ప్రశంసించారు.ఒడ్డు దాటేంత వరకు ఓడ మల్లన, ఒడ్డు దిగిన తరువాత బోడ మల్లన్న అనే సామెత దాదాపు అందరూ వినే ఉంటారు.. దీని అర్థం కూడా అందరికీ తెలిసే ఉంటుంది. కానీ, ఓ ఆటో డ్రైవర్‌ తనకు అన్నం పెట్టిన ఆటోకు గౌరవం ఇవ్వలాని నిర్ణయించుకున్నాడు. దాని కోసం ఆ వ్యక్తి తన ఇంటి పైకప్పు మీద ఆటోను ఏర్పాటు చేశాడు. క్రేన్ సాయంతో అతడు ఆటోను ఇంటి పై కప్పు మీదకు ఎక్కించాడు.దీన్ని  చూసి చాలా మంది నెటిజన్లు ఇష్టపడుతున్నారు. ఇంకా ఆ ఆటో డ్రైవర్‌ని ఎంతగానో ప్రశంసించారు.