పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు...
Nov 25, 2024
నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభంలో మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ .. పార్లమెంట్లో ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. విపక్షాలను టార్గెట్ చేస్తూ.. పార్లమెంట్లో చర్చకు అనుమతించడం లేదని ఆరోపించారు. 'ఇది 2024 సంవత్సరానికి చివరి కాలం' అని ప్రధాని అన్నారు. మన రాజ్యాంగం 75 సంవత్సరాల ప్రయాణం, 75వ సంవత్సరంలోకి ప్రవేశించడం ప్రజాస్వామ్యానికి మంచి అవకాశమని గుర్తు చేశారు. రాజ్యాంగం 75వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించడానికి రేపు అందరూ రాజ్యాంగ పరిషత్లో కలిసి రావాలని ప్రధాని కోరారు.