Current Date: 26 Nov, 2024

పవన్ కళ్యాణ్ అసహనం వెనుక అసలు కారణం ఇదేనా?


సినీ సెల‌బ్రిటీలు చిన్న విమ‌ర్శ‌ని కూడా త‌ట్టుకోలేరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. ప్రతిపక్ష నాయ‌కుడిగా ఇన్నాళ్లు  ప‌వ‌న్‌ ఘాటుగా విమర్శలు గుప్పించారు. కానీ.. ఇప్పుడు అవే ఆయ‌న మెడ‌కు రాజ‌కీయంగా చుట్టుకున్నాయి.వైసీపీ హ‌యాంలో 30 వేల మందికి పైగా మ‌హిళ‌లు అదృశ్య‌మ‌య్యార‌ని ప‌వ‌న్‌ అప్పట్లో సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల్ని చేశారు. అలాగే క‌ర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి కేసుని 100 రోజుల్లో తేల్చేస్తాన‌ని శ‌ప‌థం చేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల సీపీఎస్ ర‌ద్దు, ఓపీఎస్ తీసుకురావ‌డంపై ప‌వ‌న్ హామీ ఇచ్చారు. అలాగే కూట‌మిని అధికారంలోకి తెచ్చుకుంటే ఆడ‌పిల్ల‌ల ర‌క్ష‌ణ బాధ్య‌త తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు.కానీ అధికారంలోకి వచ్చాక  తానిచ్చిన హామీల్ని నిల‌బెట్టుకోడానికి ప‌వ‌న్ ఎలాంటి చొర‌వ తీసుకోలేకపోతున్నారు. దాంతో సోష‌ల్ మీడియాలో ఆయ‌న్ను నిల‌దీసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఈ ప‌రిణామాలు ప‌వ‌న్‌లో తీవ్ర అస‌హ‌నాన్ని పెంచుతున్నట్లు కనిపిస్తోంది.

Share