ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు.. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. నారా లోకేష్ నివాసంలో చాగంటి కోటేశ్వరరావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. చాగంటి కోటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైతిక విలువల సలహాదారుగా ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే.విద్యార్థుల్లో మహిళలు, పెద్దలు, గురువులపై గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని తీసుకున్న నిర్ణయం గురించి ఆయనతో చర్చించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన పెంపొందించేందుకు సలహాలు, సహకారం అందిస్తానని చాగంటి కోటేశ్వరరావు అన్నట్లు నారా లోకేష్ తన ట్వీట్లో రాసుకొచ్చారు.గతంలో రెండుమూడు సార్లు పదవులు ఇస్తే.. ఆయన తీసుకోవడానికి అంగీకరించలేదు. టీడీపీ ప్రభుత్వం ఒకసారి, వైసీపీ సర్కారు మరోసారి ఆయనకు పదవులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అయితే అప్పట్లో వాటిని తీసుకునేందుకు ఆయన నిరాకరించారు.
Share