Current Date: 07 Oct, 2024

నా కాళ్లకు నమస్కరించవద్దు ఎవరైనా నా కాళ్లు మొక్కితే నేను కూడా వారి కాళ్లు మొక్కుతా సీఎం చంద్రబాబు

ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లకు నమస్కరించే పని చేయవద్దని సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజలతో కాళ్లకు నమస్కారం పెట్టించుకునే సంస్కృతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంత వారిస్తున్నా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తన కాళ్లకు నమస్కారాలు చేస్తున్నారని ఇలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, గురువులు, దేవుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలని నాయకులకు కాదని చంద్రబాబు అన్నారు. రాజకీయ నాయకులు కూడా ఈ సంస్కృతికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలకు నేరుగా ఆయన విజ్ఞప్తి చేశారు. వారించినా కూడా వినకుండా ఎవరైనా తన కాళ్లకు మొక్కితే తిరిగి తాను కూడా వాళ్ల కాళ్లకు మొక్కుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Share