Current Date: 27 Nov, 2024

సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు.. కాపాడిన అధికారులు

సముద్రంలో చిక్కుకున్న 9 మంది మత్స్యకారులను అధికారులు సురక్షితంగా కాపాడారు. నెల్లూరు జిల్లాకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు మెకనైజ్డ్‌ బోట్‌లో మంగళవారం చేపల వేటకు వెళ్లారు. వాకాడు మండలంలోని వైటీ కుప్పానికి సముద్రంలో 14కిలో మీటర్ల దూరంలో వీరి బోట్‌ ఇంజిన్‌ మరమ్మతులకు గురైంది. దీంతో బోట్‌లో ఉన్న జాలర్ల నుంచి అందిన సమాచారం మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ విషయం తెలపగా ఆయన వెంటనే స్పందించారు. ఉన్నతాధికారులతో సంప్రదించి నేవీ, కోస్ట్ గార్డ్ అధికారులతో కలిసి పెద్ద పడవల సాయంతో సముద్రంలో చిక్కుకున్న 9మంది జాలర్లతో కూడిన బోటును బుధవారం కృష్ణపట్నం పోర్టు వద్దకు చేర్చారు. ప్రమాదం నుంచి బయటపడిన మత్స్యకారులు జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Share