Current Date: 05 Oct, 2024

కోనసీమలో ఫేక్ నోట్ల కలకలం ఏటీఎంలోనూ తప్పని బెడద!

ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ నోట్ల చెలామణీ రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నకిలీ నోట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి . బ్యాంకు ఏటీఎంలలో నగదు డ్రా చేస్తున్నా అందులోనూ ఫేక్ నోట్లే దర్శనిమిస్తున్నాయి . దీంతో కస్టమర్లు నోట్లు తీసుకోవాలంటే భయపడిపోతున్నారు. ఫేక్ నోట్లు పెరుగుతుండటంతో బ్యాంకులు కూడా కస్టమర్లకు కీలక సూచనలు చేస్తున్నాయి. కోనసీమలో మండపేట, రామచంద్రపురం, రావులపాలెం, అమలాపురం ప్రాంతాల్లో 100, 200, 500 రూపాయల కట్టల్లో కనీసం ఒక ఫేక్ నోటు వస్తోందని కస్టమర్లు చెబుతున్నారు. దీంతో లెక్కింపు తర్వాత కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు. ఫేక్ నోట్లు కూడా  అసలు నోట్లలాగే ఉండటంతో  వాటిని తిరిగి బ్యాంక్‌లు డిపాజిట్ చేసేందుకు వెళ్లిన సమయంలో సమస్యలు తప్పడం లేదు. నోట్లు సరి చూసి తీసుకోవాలని బ్యాంక్ అధికారులు కస్టమర్లకు సూచిస్తున్నారు.ఏదైనా అనుమానం ఉంటే వెంటనే తమ బ్యాంకు బ్రాంచ్‌లను సంప్రదించాలని కోరుతున్నారు. ఫేక్ నోట్లపై ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదులు అందుతున్నాయి.

Share