Current Date: 28 Nov, 2024

తిరోగమనంలో కాజల్ అగర్వాల్ కెరీర్.. మళ్లీ మొదటికి

టాలీవుడ్‌లో దశాబ్ధకాలం టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడు కెరీర్‌లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పెళ్లి చేసుకొని బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి గత ఏడాది రీఎంట్రీ ఇచ్చింది కాజల్. కానీ ఆమె కెరీర్ ఏమంత ఆశాజనకంగా సాగడంలేదు.కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పోలీస్ గెటప్ వేసిన కాజల్ అగర్వాల్ సత్యభామ అనే సినిమా చేసింది. కానీ ఆశించిన ఫలితం రాలేదు. ఇక భగవంత్ కేసరి సినిమా హిట్టయినప్పటికీ అందులో కాజల్ పాత్రకి పేరు రాలేదు. మొత్తం శ్రీలీల కొట్టేసింది. ఆ మూవీలో చెప్పాలంటే సెకెండ్ హీరోయిన్‌గానే కాజల్ అగర్వాల్ కనిపించింది. ఇప్పుడు తెలుగులో ఈ సీనియర్ భామకి సినిమాలు లేవు.టాలీవుడ్‌లో డోర్స్ క్లోజ్ అవడంతో మళ్లీ బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ పాత్రకే కమిటైనట్టు కనిపిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ సినిమా రాబోతోంది. ఇందులో మెయిన్ హీరోయిన్‌గా  ఇప్పటికే రష్మిక మందానాని తీసుకున్నారు.దాంతో కాజల్ సెకండ్ హీరోయిన్‌గా చేస్తోంది. 

Share