Current Date: 15 Nov, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా మారడంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. పశ్చిమ గోదావరి, గుంటూరు, ఎన్టీఆర్, వైఎస్సార్, ఏలూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కృష్ణ, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేశారు. మూడు రోజుల పాటు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందన్నారు. అలాగే, కర్నూలు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని వివరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. చెరువులు, నదులు, రిజర్వాయర్ల చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

Share