Current Date: 25 Nov, 2024

రేపే ఉత్పన్న ఏకాదశి...

హిందూ మతంలో ఉత్పన్న ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్పన్న ఏకాదశిని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్షం ఏకాదశి తిథి రోజున జరుపుకుంటారు. ఈ పవిత్రమైన సందర్భంలో శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవిని పూజిస్తారు. పురాణ శాస్త్రాల ప్రకారం ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ద్వారా.. మోక్షం లభిస్తుందని.. వైకుంఠ ధామంలో స్థానం పొందుతారని నమ్మకం. అనేక జన్మల పాపాలు నశిస్తాయి. అలాగే విష్ణువు ఆశీర్వాదం ఇంట్లోని ప్రజలందరికీ ఉంటుంది. జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి నవంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 1:01 గంటలకు ప్రారంభమై నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున 3:47 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం ఉత్పన్న ఏకాదశి నవంబర్ 26 న జరుపుకుంటారు. నవంబర్ 27 మధ్యాహ్నం 1:12 నుంచి 3:18 వరకు ఉపవాస దీక్షను విరమించే సమయం ఉంటుంది.

Share