హైదరాబాద్‌లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సిద్ధిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ పట్టుబడ్డాడు. మధురానగర్ పరిసరాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో బ్రీత్ అనలైజర్ పరీక్షకు నిరాకరించే ప్రయత్నం చేశాడు.యూనిఫామ్‌లో లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన వాహనాన్ని ఆపి బ్రీజ్ ఎనలైజర్ ముందు ఊదమన్నారు. అందుకు ఆయన నిరాకరించాడు. అంతటితో ఆగకుండా తాను డిపార్ట్మెంట్ అంటూ కాస్తా రుబాబుగా మాట్లాడారు. దీంతో అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి ఏసీపీ సుమన్ కుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు.సదరు అధికారి మద్యం తాగినట్లుగా తేలడంతో అతనిపై చర్యలకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో రోడ్డుపై కాసేపు హడావుడి నెలకొంది. పోలీసుల వాగ్వాదంతో వాహనదారులు ఏం జరుగుతుందా? అని సెల్‌ఫోన్ కెమెరాలు ఆన్ చూసి చూస్తూ నిల్చొన్నారు.