ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒకే ఒక మంత్రి వంగలపూడి అనిత. పాయకారావుపేట నియోజకవర్గం నుంచి రెండవసారి శాసనసభకు ఎన్నికైన అనితకు జిల్లాలో అగ్రస్థానం లభించింది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలిగా వున్న అనిత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఆటుపోట్లకు గురయ్యారు. జగన్ ప్రభుత్వంలో అనేక కష్టాలను చవిచూశారు. అయినప్పటికీ వైసీపీ అకృత్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో కృతకృత్యురాలయ్యారు. దీనికి ప్రతిఫలంగానే మంత్రి వర్గంలో సముచిత స్థానం లభించింది.