Current Date: 25 Nov, 2024

Are You Eating potato chips? But this news is for you!

పోటాటో చిప్స్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో.. ఉప్పగా, కారంగా ఉండటమే కాదు.. రుచిగా కూడా ఉండటంతో చిన్నా,పెద్దా అందరు తినడానికి ఇష్ట పడతారు.. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వారానికి ఒకసారి తింటే పర్లేదు కానీ అదే పనిగా తింటే మాత్రం హానికరం అని అంటున్నారు.అదేపనిగా నూనెలో వేగించిన స్నాక్స్‌ను తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు అంటున్నారు.. నూనెలో బాగా వేయించడం వల్ల నోటికి రుచిగా ఉంటుంది అంతే.. వీటిలో ఎటువంటి పోషకాలు ఉండవు.. నూనెలో వేగించటం వలన వాటిలో ఉండే పోషకాలు నశిస్తాయి.అందువల్ల ఈ ఆహారాలకు బదులు సలాడ్స్ తింటే మంచిది.. శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి..

చిప్స్ లో సోడియం అధిక మొత్తంలో ఉండటం వలన రక్తపోటు పెరుగుతుంది.. ఇక రోజూ తీసుకోవడం వల్ల ఒంట్లో కొవ్వు బాగా పెరిగిపోతుందని చెబుతున్నారు.. డీప్- ఫ్రై చేయడం ద్వారా చిప్స్‌లో ట్రాన్స్‌ఫాట్ పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వేగించిన ఆహారాలలో ట్రాన్స్ ఫాట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. జాగ్రత్త.