తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకుంటున్నాయి. ఇవాళ, రేపు తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. అటు ఏపీలోని కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు, రాయలసీమ, ఉత్తరాంధ్రలో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.