Current Date: 28 Jun, 2026

అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం

 రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అంతకుముందు తలనీలాలు సమర్పించారు. TTDకి సుమారు రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే బస్సులకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థే భరిస్తుందని వెల్లడించారు. తిరుమలలో E-బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.