Current Date: 15 Jul, 2026

సీదిరి అప్పలరాజు కుమారుడికి రిమాండ్

మాజీ మంత్రి డా. సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ను సోమవారం రాత్రి పోలీసులు రిమాండు తరలించారు. ఈనెల 10వ తేదీన గొర్రెల కాపరి దానయ్యను బైక్తో ఢీకొన్న ఘటనలో ఆయన మృతిచెందిన విషయం తెలిసిందే. నేరాన్ని ఒప్పుకొని ఆరవ్ సోమవారం కాశీబుగ్గ పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు పలాస కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో అతడిని అంపోలు జిల్లా జైలుకు తరలించారు